తీరని కోరిక ఒకటి ఉంది… సూపర్ స్టార్
రాజకీయాల్లోకి రావాలంటే పేరు, హోదా ఉంటే చాలదని, అంతకంటే ఎక్కువ అర్హతలే ఉండాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ప్రముఖ నటుడు కమలహాసన్ తన సొంత పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రజనీ స్పందించారు. కాగా, రోబో 2.0 ఆడియో వేదిక రెండు రోజుల క్రితం దుబాయ్ లో గ్రాండ్ గా జరిగిన విషయం విదితమే. తీరని కోరిక ఒకటి ఉంది. ఏం జరుగుతుంతో చూడాలి అని ఈ వేడుకలో పాల్గొన్న రజనీ వ్యాఖ్యానించారని ఫిల్మ నగర్ వర్గాల సమాచారం. రాజకీయాల్లోకి తన రంగప్రవేశం గురించి రజనీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు చిత్రవర్గాలు భావిస్తున్నాయి.













