రియలిస్టిక్‌గా తెరకెక్కుతున్న తండేల్
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొందరి మత్య్సకారుల నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో చైతూ ఓ మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు. రీసెంట్గా సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా ఓ కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఉడిపి లాంటి ప్రాంతాల్లో జరిగింది. కీలక సన్నివేశాలన్నింటినీ పోర్టు సహా సుందరమైన గ్రామాల్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ప్రధాన నటీనటులందరూ పాల్గొన్నారు. ఇకమీదట తండేల్ కు సంబంధించిన అప్డేట్స్ వరుసగా రానున్నాయట.
రీసెంట్ గా ఇదే విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను నెట్టింట షేర్ చేశారు. వర్కింగ్ స్టిల్స్ చూస్తుంటే చందూ మొండేటి, తండేల్‌ను ఎంతో రియలిస్టిక్‌గా తీస్తున్నట్లు అర్థమవుతోంది. చైతూ రగ్గుడ్ లుక్ లో ఫుల్ గెడ్డంతో కనిపిస్తుంటే, సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయిలా సినిమాలో కనిపించనుంది. తండేల్ లో అద్భుతమైన లవ్ స్టోరీ ని చూడబోతున్నారని చిత్ర యూనిట్ ముందు నుంచి చెప్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.













