Thammudu: భలే డేట్ పట్టేసిన నితిన్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) నటించిన రెండు సినిమాలు ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. మార్చి 28న రాబిన్హుడ్(Robinhood) రిలీజ్ కానుంది. హరిహర వీరమల్లు(Harihara Veeramallu) కూడా అదే రోజున రిలీజ్ అవుతుందని అనుకోవడంతో ఎవరూ ఆ రోజుకు తమ సినిమాల్ని షెడ్యూల్ చేసుకోలేదు. దీంతో రాబిన్హుడ్ కు ఎలాంటి పోటీ లేదు.
ఆ తర్వాత రోజు మ్యాడ్ స్క్వేర్(Mad Square) రూపంలో మాత్రం నితిన్ కు గట్టి పోటీనే ఎదురుకానుంది. ఇది కాకుండా నితిన్ మరో సినిమా తమ్ముడు ఇప్పుడు మే 9న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. ఇది ఎంతో మంచి డేట్. దానికి మొదటి రీజన్ మే9 బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ ఉన్న డేట్. ఇప్పటివరకు గతంలో ఆ రోజున వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్లుగా నిలిచినవే.
జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka veerudu Athiloka Sundari), గ్యాంగ్ లీడర్(Gang Leader), మహానటి(Mahanati), మహర్షి(Maharshi) లాంటి సినిమాలు రిలీజై భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ముందు ఈ డేట్ ను విశ్వంభరకు ఫిక్స్ చేద్దామనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ లేటవడం వల్ల జూన్ కు వాయిదా పడుతుందంటున్నారు. రవితేజ(Ravi teja) మాస్ జాతర(Mass Jathara) కూడా ఇదే డేట్ లో అనుకున్నారు కానీ కుదరడం లేదట. వాస్తవానికి తమ్ముడు(Thammudu) శివరాత్రికే రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ లేటవడం వల్ల వాయిదా పడి ఇప్పుడు మంచి రిలీజ్ డేట్ ను సెట్ చేసుకుంది. ఈ రిలీజ్ డేట్ పట్ల నితిన్ సైతం చాలా హ్యాపీగా ఉన్నాడని తెలుస్తోంది.













