Thammudu: ఒక్క రాత్రిలో జరిగే కథే తమ్ముడు

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. రాబిన్‌హుడ్(Robinhood) సినిమా హిట్టవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేక పోయింది. దీంతో ఇప్పుడు నితిన్ ఆశలన్నీ తమ్ముడు(Thammudu) సినిమాపైనే ఉన్నాయి. ఓ మై ఫ్రెండ్(Oh My Friend), వకీల్ సాబ్(Vakeel Saab) సినిమాల దర్శకుడు వేణు శ్రీ రామ్(Venu Sri Ram) తో నితిన్(Nithin) చేస్తున్న సినిమానే తమ్ముడు.
జులై 4న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే తమ్ముడు సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టగా చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఈ సినిమా స్టోరీ లైన్ కు సంబంధించిన విషయాలను రివీల్ చేశారు. తమ్ముడు సినిమాలో లయ(Laya) నితిన్ కు అక్కగా నటిస్తుందని చెప్పారు.
తమ్ముడు కథ మొత్తం ఒక్క రాత్రిలోనే జరుగుతుందని, యాక్షన్, ఎమోషన్ తో కథ ఎంతో గ్రిప్పింగ్ గా ఉంటుందని, తమ్ముడు స్క్రీన్ ప్లే సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ఆయన తెలిపారు. సప్తమి గౌడ(Saptami Gowda), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), శ్వాసిక(Swasika) కీలక పాత్రల్లో నటిస్తున్న తమ్ముడు సినిమాకు అజనీష్ లోక్‌నాథ్(Ajanessh Loknath) సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా నితిన్ కంబ్యాక్ అవుతాడేమో చూడాలి.