Thammudu: తమ్ముడుకు షాకిచ్చిన సెన్సార్ బోర్డు

హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్న టాలీవుడ్ హీరో నితిన్(Nithi) ఆశలన్నీ ఇప్పుడు తమ్ముడు సినిమా పైనే ఉన్నాయి. తన ఆశలకు తగ్గట్టే తమ్ముడు ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గానే ఉంది. ఓ మై ఫ్రెండ్(Oh My Friend), వకీల్ సాబ్(Vakeel Saab) డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sri Ram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, సీనియర్ హీరోయిన్ లయ(Laya) చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాతోనే కంబ్యాక్ ఇవ్వబోతోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్ లో దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్న ఈ సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అయితే ఎవరూ ఊహించిన విధంగా తమ్ముడు సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. దీంతో దిల్ రాజు నుంచి వచ్చే సినిమాకు ఏ సర్టిఫికెట్ ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం తమ్ముడు సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ లో హింస ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. కథ డిమాండ్ చేయడంతో డైరెక్టర్ వేణు శ్రీ రామ్ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ను అంతే ఉంచారని, మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే బస్ ఛేజ్ తో పాటూ రెండు ముఖ్యమైన ఫైట్స్ లో రక్తపాతం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ సెన్సార్ సర్టిఫికెట్ వల్ల తమ్ముడు సినిమాకు ఏమైనా నష్టం కలుగుతుందేమో చూడాలి.