కసి మీదున్న తమన్
ప్రస్తుతం మోస్ట్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే అందరూ చెప్పే పేరు తమన్. కానీ ఈ మధ్య కాలంలో ఆయన నుంచి హిట్ ఆల్బమ్స్ కంటే ట్రోలింగ్సే ఎక్కువవుతున్నాయి. అంతేకాదు ఆయన్నుంచి వస్తున్న పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలుస్తుండటంతో తమన్ జోరు తగ్గిందేమోననే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
ఇలాంటి టైమ్ లో తమన్ బాలీవుడ్ సినిమా బేబీ జాన్ కు సంగీతం అందిస్తున్నాడు. వరుణ్ ధావన్ హీరోగా అట్లీ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. 2016లో వచ్చిన తమిళ సూపర్ హిట్ తేరికి ఇది అఫీషియల్ రీమేక్. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ దాంతో పాటూ టీజర్ ను రిలీజ్ చేశారు.
ఆ టీజర్‌కు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పించింది. దీంతో బేబీ జాన్ లో తమన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని చెప్తున్నారు. ఇప్పటికే చాలా ట్రోలింగ్స్ ను ఎదుర్కొన్న తమన్ బాగా కసి మీద ఉన్నాడని, ఆ కసితోనే బేబీ జాన్ కు అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వనున్నాడని ఆయన ఫ్యాన్స్ చెప్తున్నారు.













