బాలీవుడ్ పై కన్నేసిన తమన్
ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఎక్కువ డిమాండ్ ఉన్న తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ తమనే. దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఉన్నాడు కానీ దేవీ చేతిలో పుష్ప, కంగువా లాంటివి తప్ప తమన్ లాగా ఎక్కువ సంఖ్యలో పాన్ ఇండియా సినిమాలు చేతిలో లేవు. టాలీవుడ్ లో తన సత్తా చాటిన తమన్, తమిళంలో కూడా తన సత్తాను ఇప్పటికే చాటుకున్నాడు.
అయితే ఇప్పుడు తమన్ చూపు బాలీవుడ్ పై పడినట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా హిందీలో తేరీ సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్స్ గా కీర్తి సురేష్, వామికా గబ్బి నటిస్తున్నారు. అట్లీ నిర్మాతగా, కలీస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తమన్ రెండు హిందీ సినిమాలకు వర్క్ చేశాడు. కాకపోతే ఆ సినిమాల్లో ఒక పాట మాత్రమే తమన్ కంపోజ్ చేశాడు. కాబట్టి అవి కౌంట్ లోకి రావు. వరుణ్ తో తమన్ చేసే సినిమానే తనకు బాలీవుడ్ డెబ్యూ కానుంది. డెబ్యూ సినిమా కాబట్టి ఎలాగూ ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికే తమన్ ట్రై చేస్తాడు. మరి బాలీవుడ్ లో తమన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.













