అడ్డంగా దొరికిన తమన్ !!!
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత చాలానే ఉందని చెప్పాలి. తిప్పి తిప్పి కొడితే మణిశర్మ, కీరవాణి, దేవిశ్రీ, తమన్. ప్రస్తుతం ఎక్కువ క్రేజ్ ఉంది అంటే తమన్ కి మాత్రమే. ఒకప్పుడు దేవిశ్రీ తన మ్యూజిక్ తో ఫస్ట్ లో ఉన్నా రాను రాను తమన్ ఆ స్థానాన్ని భర్తీ చేసాడు. తమన్ మోస్ట్ పాపులర్ అయినా కానీ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదొక చర్చ జరుగుతూనే ఉంటుంది తన మ్యూజిక్ గురించి.
అయితే అసలు ఈ చర్చలు ఎందుకంటారు?? దానికి కారణం తమన్ పైన ఉన్న ‘కాపీ’ అనే బిరుదే. మంచి మంచి ట్యూన్స్ అన్నీ ప్రేక్షకులకి అందిస్తాడు. కానీ దాని వెంటనే ఈ ట్యూన్స్ ఎక్కడినుంచి వచ్చాయని ఆరా తీస్తే దాని ఒరిజినల్ సాంగ్స్ బయటకు వస్తాయి. ఇలా తమన్ సోషల్ మీడియాలో దొరికి మీమర్స్ కి టాపిక్ గా నిలిచిన రోజులు చాలానే ఉన్నాయి. ఈ మధ్యలో కొన్ని సినిమాలకు పూర్తి భిన్నంగా మ్యూజిక్ అందించిన తమన్ ఈ మధ్య మళ్ళీ ట్రోల్ అవుతున్నాడు.
రీసెంట్ గా ‘స్కంద’ సినిమాకి అందించిన మ్యూజిక్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. దానికంటే ముందు వచ్చిన ‘ఓజీ’ టీజర్ కి తమన్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది అని కొనియాడారు. కానీ తరువాత అది కూడా కాపీ అని నెటిజన్లు దాని ఒరిజినల్ చూపించి మరి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు తమన్ మరొకసారి తన కాపీ మ్యూజిక్ తో దొరికేసాడు. అయితే ఈసారి కాపీ చేసింది వేరే ఎవరి ట్యూన్స్ కావు, తన ట్యూన్స్ ని తానే కాపీ చేసి మళ్ళీ వాడుకున్నాడు.
రీసెంట్ గా రిలీజైన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ కు మంచి మ్యూజిక్ అందించాడు. కానీ దానిలో బాలయ్య ఒక మాస్ డైలాగ్ చెబుతాడు, దానిలో భాగంగా మనకి వినిపించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే తమన్ అందించిన ‘బ్రో ‘ సినిమాలో ‘బ్రో …బ్రో ..’ అని వచ్చే ట్యూన్స్ ని రిపీట్ లో అందించాడు అని అనిపిస్తుంది. ఇక ఇదే సరైన సమయం అని నెటిజన్లు తమదైన విమర్శలతో తమన్ ని ఆట ఆడుకుంటున్నారు. మరి తమన్ వీటికి సమాధానం ఇస్తాడో? లేక తన మ్యూజిక్ తోనే అందరి ప్రశ్నలకి జవాబు ఇస్తాడో చూద్దాం.













