Thaman: నాకు, సిద్ధార్థ గాడికి అసలు పడదు: తమన్
సౌత్ లో మంచి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్(Thaman) కూడా ఒకడు. మణిశర్మ (Manisharma) శిష్యుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కీ బోర్డు ప్లేయర్ గా పని చేసిన తమన్, కిక్(Kick) మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇప్పుడు తమన్ వరుస సినిమాలతో అసలు ఖాళీ దొరకనంత బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఆయన వర్క్ చేసిన శబ్ధం(Shabhdam) మూవీ థియేటర్లలోకి వచ్చింది.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో తమన్ కూడా పాల్గొన్నాడు. ఓ ఇంటర్వ్యూలో బాయ్స్(Boys) సినిమా షూటింగ్ టైమ్ లో జరిగిన పలు విషయాలను, తాను చేసిన రచ్చను గుర్తు చేసుకున్న తమన్, ఆ సెట్స్ లో తాను చాలా గొడవ చేసేవాడినని, అందరినీ టార్చర్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా సిద్ధార్థ్(Siddharth)కు తనకు అసలు పడేది కాదని చెప్పాడు తమన్.
సెట్స్ లో ఉన్నప్పుడు సిద్ధార్థ్ కి గాజు గ్లాస్ జ్యూస్ ఇస్తే, తనకు మాత్రం స్టీల్ గ్లాస్ లో ఇచ్చారని, బెదిరించి మరీ తాను కూడా గాజు గ్లాస్ లో జ్యూస్ తెప్పించుకున్నానని, పది రూపాయల జ్యూస్ గొడవను కూడా నిర్మాత దగ్గరకు తీసుకెళ్లానని, వాటిని ఇప్పుడు తలచుకుంటుటేనే నవ్వొస్తుందని తమన్ తెలిపాడు. ఆ గొడవలన్నింటినీ చూసి శంకర్(Shankar) ప్రతీదానికీ ఇలా ఛీప్ గా గొడవ పడుతున్నారేంటనుకునే వాడని తమన్ చెప్పాడు.













