Thaman: ఒక భాషలో వర్కవుట్ అయిన మ్యూజిక్ మరో భాషలో వర్కవుట్ అవదు
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. 64 మంది మ్యూజిక్ డైరెక్టర్లతో ఎన్నో సినిమాలకు పని చేసిన తమన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సంగీతం గురించి చేసిన పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆడియన్స్ లోకి మ్యూజిక్ బాగా వెళ్లాలంటే దానికి కీలకమైంది అక్కడి కల్చరేనని తమన్ చెప్పాడు.
మనం సినిమా చేస్తున్నప్పుడు అక్కడి కల్చర్ ను అర్థం చేసుకుని సంగీతం చేస్తే ఆ మ్యూజిక్ తప్పక క్లిక్ అవుతుందని తమన్ అంటున్నాడు. ప్రాంతాన్ని బట్టి మ్యూజిక్ టేస్ట్ మారుతుందని చెప్పిన తమన్, తమ మరియు సూళ్లూరుపేట ప్రాంతాలకు 50 కి.మీ దూరమే అయినప్పటికీ ఆ ప్రాంతాల్లో వినే మ్యూజిక్ వేరు వేరని, ప్రతీ ప్రాంతానికీ మ్యూజిక్ పరంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తమన్ తెలిపాడు.
ప్రతీ భాషకూ సొంత రిథమ్ ఉంటుందని, ఒక భాషలో క్లిక్ అయ్యే మ్యూజిక్ మరో భాషలో వర్కవుట్ అవదని, అందుకే వేరే భాషలో సినిమాకు మ్యూజిక్ చేసేటప్పుడు ముందుగా అక్కడి వాళ్లు ఎలాంటి పాటలు వింటారు? రీసెంట్ టైమ్స్ లో అక్కడ ఎలాంటి మ్యూజిక్ వర్కవుట్ అయిందనే విషయాలన్నింటినీ పరిగణించాకే సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయడం స్టార్ట్ చేస్తామని తమన్ పేర్కొన్నాడు.






