ఎకె ఎంటర్టైన్మెంట్స్ లో మెగాస్టార్ చిరంజీవి చిత్రం?
ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అనిల్ సుంకర అంటే హీరో మహేష్ బాబు కు అత్యంత సన్నిహితుడు. అనిల్ సుంకర, మహేష్ బాబు కుటుంబాల నడుమ సన్నిహిత సంబంధాలు వున్నాయి. అలాగే అనిల్ సుంకర నిర్మించిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు చీఫ్ గెస్ట్ గా పిలిచిన వెంటనే ప్రత్యేకంగా వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవికి కూడా హీరో మహేష్ బాబు అంటే కూడా ప్రత్యేకమైన అభిమానం.
ఈ ట్రయాంగిల్ ఫ్రెండ్ షిప్ మరోసారి రుజువు అవుతోంది. అనిల్ సుంకర నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఫిక్స్ అయినట్లే. తమిళ సినిమా ‘వేదాలం’ రీమేక్ రైట్స్ అనిల్ సుంకర దగ్గరే వున్నాయి. ‘వేదాలం’ ను తెలుగులో మెహర్ రమేష్ డైరక్షన్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెహర్ రమేష్ స్క్రిప్ట్ ను అనిల్ సుంకరకు నెరేట్ చేసినట్లు బోగట్టా. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఆసక్తి కరమే.. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అధికారిక ప్రకటన రాబోతుంది.













