ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురి కాగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్సాస్ట్రో (ఏఐజీ) ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక చికిత్స అందించడానికి మద్రాసు నుంచి వైద్యుడిని రప్పించి చికిత్స అందించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ ఆయన సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.













