అటు తిరిగీ ఇటు తిరిగీ మెగాస్టార్ వద్దకు చేరిన చర్చ
తెలంగాణలో కొనసాగుతున్న థియేటర్ల పర్సంటేజ్ విధానం వివాదం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న విభేదాలు రోజు రోజుకు మరింత ముదురుతున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న పెద్ది సినిమాను థియేటర్లలో ప్రదర్శించబోమని ఎగ్జిబిటర్లు హెచ్చరించడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయకపోతే పెద్ద సినిమాలకు సహకరించబోమని స్పష్టంగా చెప్పడంతో ఈ వ్యవహారం మరింత సీరియస్‌గా మారింది. ఇప్పటికే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి పలు సమావేశాలు నిర్వహించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన పరిష్కారం దొరకలేదు.
ఇదిలా ఉండగా ఈ వివాదాన్ని సర్దుబాటు చేసే దిశగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈరోజు తెలంగాణ ఎగ్జిబిటర్ల ప్రతినిధులు చిరంజీవిని ఆయన నివాసంలో కలుసుకుని తమ సమస్యలను వివరించనున్నారు.
ఇవి కూడా చదవండి
అనంతరం ప్రముఖ నిర్మాతలతో కూడా చిరంజీవి చర్చలు జరిపే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ తర్వాత అయినా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా నెక్ట్స్ వీకెండ్ కి ముందే ఓ నిర్ణయం రావాలని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.
కాగా పెద్ది(Peddi) సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తుండగా, రామ్ చరణ్(Ram Charan) సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. థియేటర్ వ్యవస్థ ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న వేళ, పెద్ది సక్సెస్‌పై ఎగ్జిబిటర్లు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి







