ఆ రూమర్లపై తమన్నా క్లారిటీ
ఈ మధ్య సోషల్ మీడియా వల్ల మరీ రూమర్లు ఎక్కువైపోయాయి. ఏదైనా పుకారు రావడం లేట్, దాన్ని చీల్చి చెండాడే వరకు వదలట్లేదు. రీసెంట్ గా బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించగా, తమన్నా దాని కోసం భారీ రెమ్యూనరేషన్ అడిగిందని దీంతో నిర్మాతలు నిర్ణయం మార్చుకున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.
అయితే ఈ వార్తలు ఆ నోటా ఈ నోటా మిల్కీ బ్యూటీ వరకు వెళ్లాయి. వెంటనే ఆ విషయమై తమన్నా స్పందిస్తూ ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టి పారేసింది. బాలయ్య, అనిల్ మీద తనకు ఎంతో గౌరవ మర్యాదలున్నాయని, గాలి మాటలకు ప్రాధాన్యం ఇస్తూ కొన్ని వర్గాలు ఇలాంటి న్యూస్ ను స్ప్రెడ్ చేయడం బాధగా ఉందని పేర్కొంది.
ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలకు అనిల్ తో పని చేసిన తమన్నాను నిజంగా అనిల్ అడిగితే కాదనే ప్రసక్తే లేదు. ఇప్పటికే ఎలాగూ తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసి ఉంది కాబట్టి నో అనే ఛాన్స్ అయితే లేదు. కానీ అసలు అలాంటి ప్రపోజలే లేకుండా ఇలా గాసిప్ రాయుళ్లు గాసిప్స్ రాయడంతోనే అసలు సమస్యంతా. ఇదిలా ఉంటే NBK108 విషయానికొస్తే రీసెంగా ఓ కీలక షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. విజయదశమికి ఈ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.













