తమన్నాకి మిగిలిన చేదు అనుభవం..
ఎంత స్టార్ హీరో హీరోయిన్స్ అయినా కొన్ని కొన్ని చేదు అనుభవాలు ఉండటం సహజం.వారి అనుభవం పెరిగే కొద్దీ తమ చిత్ర పాత్రల్లో లోపాలు కూడా బాగానే తెలుస్తుంటాయి. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అలా రిగ్రెట్ అయిన మూవీ ఒకటి ఉంది. ఆ మూవీ తమన్నాకి చేదు అనుభవమే అని చెప్పింది. అదే తమిళ్ లో నటించిన ‘సుర’.
మిల్కీ బ్యూటీ తమన్నా, తమిళ స్టార్ హీరో అయిన విజయ్ కలిసి నటించిన ఏకైక సినిమా ‘సుర’. ఈ మూవీకి దర్శకుడు ఎస్.పి. రాజ్ కుమార్, సంగీతం మణిశర్మ. విజయ్ కెరీర్లోనే పెద్ద ఫ్లాప్ ఏదైనా ఉంది అంటే అది ‘సుర’ అనే చెప్పాలి. ఈ మూవీ ద్వారా తమన్నాకి కూడా చేదు అనుభవమే లభించింది. అయితే ఈ సినిమా లోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్. ఆ సాంగ్స్ ట్యూన్స్ కూడా చాలా వరకు తెలుగు ట్యూన్స్ నే వాడారు మణిశర్మ.
తమన్నా తన అందాలతో మైమరిపించినా ఈ సినిమాలో తాను చేసిన పాత్ర తనకే నచ్చలేదట. అలా అని ఈ మూవీ అంటే ఇష్టం లేదా అంటే కొన్ని రకాలుగా ఈ మూవీ అంటే ఇష్టమే అనే చెప్పుకొచ్చింది. ఇక సుర మూవీలోని సాంగ్స్ అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. సుర మూవీలో కొన్ని సీన్స్ లో తన నటన తమన్నాకే నచ్చలేదంట.
షూటింగ్ సమయంలోనే ఏదో కొంచెం తేడా ఉందని మనకి అర్థం అవుతుంది. కానీ ఆ సమయంలో నో చెప్పలేక దానిని పూర్తి చేస్తాం. సినీ పరిశ్రమ అనేది చాలా విలువైనది. ప్రతి ఒక్కరూ దాని విషయంలో భాద్యతగా ఉండాలి. అది కూడా మన రెస్పాన్స్ నే అని తమన్నా చెప్పుకొచ్చింది. ఒకప్పుడు తమిళంలో అగ్ర స్థాయిలో నిలిచిన ఈ భామ, సుర సినిమా తరువాత తమిళ చిత్రసీమకు దూరమైంది. మళ్ళీ ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘జైలర్’ అనే మూవీలో నటిస్తుంది. ఈ మూవీ తమిళ్ లో కూడా రిలీజ్ అవుతున్నది. మరి ఈ మూవీ తో మిల్కీ బ్యూటీ మళ్లీ తన స్థాయిని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.













