Tamannaah: తమన్నా డెడికేషన్ అలాంటిది
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) నటిస్తోన్న తాజా చిత్రం ఓదెల2(Odela2). అశోక్ తేజ(Ashok Teja) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఓదెల రైల్వే స్టేషన్(Odela Railway Station) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. సంపత్ నంది(Sampath Nandi) కథ అందిస్తూ నిర్మించిన ఈ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ కు కొనసాగింపుగా వస్తోన్న సినిమా కావడంతో ఓదెల2(Odela2) పై భారీ అంచనాలున్నాయి.
హెబ్బా పటేల్(Hebah Patel), వశిష్ట(Vasishta) కీలక పాత్రల్లో నటిస్తున్న ఓదెల2 ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా ఈ మూవీలో నాగసాధువుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మూవీలో ఆ పాత్ర కోసం తమన్నా ఎంతో కష్టపడిందని ఆల్రెడీ రిలీజైన కంటెంట్ చూస్తుంటే తెలుస్తోంది. ఓదెల2 కోసం తమన్నా ఎంతో బరువైన కాస్ట్యూమ్స్ వేసుకుందని, మూవీ షూటింగ్ జరిగినన్ని రోజులు చెప్పులు కూడా లేకుండా నటించిందని సంపత్ నంది రీసెంట్ గా తెలిపారు.
భైరవి క్యారెక్టర్ లో తమన్నా చాలా బాగా చేసిందని, ఇంకా చెప్పాలంటే ఆమె ఆ క్యారెక్టర్ లో జీవించిందని, సినిమాలో ఒక సీన్ ను ఎక్కువ ఎండలో తీయాల్సి వచ్చిందని, ఆ టైమ్ లో ఆమె కాళ్ల కింద ఆకులు వేస్తే, తమన్నా వద్దని వాటిని తీయించేసిందట. దీంతో ఆ ఎండలో కాళ్లు కాలి ఆ రాత్రికి తమన్నా అరికాళ్లకు బొబ్బలు వచ్చాయని, తమన్నాకు సినిమాపై ఉన్న డెడికేషన్ అలాంటిదని ఆయన అన్నారు.













