Tamannaah: బీ-టౌన్ లో బిజీబిజీగా తమన్నా

తమన్నా(tamannaah) అందం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆమె అందం చూసి అడవాళ్లు అసూయ పడతారంటే అతిశయోక్తి లేదు. ఆ అందంతోనే 35 ఏళ్ల వయసులోనూ తమన్నా వరుస అవకాశాలతో కెరీర్లో చాలా బిజీగా ఉంది. సాధారణంగా వయసు మీద పడే కొద్దీ హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతుంటాయి కానీ తమన్నా మాత్రం ఇందుకు మినహాయింపుగా కనిపిస్తుంది.
గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్లామర్ టచ్ ఉన్న క్యారెక్టర్లు చేయడానికి రెడీ అయిన తమన్నా, ఓ వైపు అవి చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్, స్పెషల్ నెంబర్లు చేయడానికి రెడీ అంటోంది. దానికి తోడు అమ్మడు చేసిన స్పెషల్ సాంగ్స్ అన్నీ చార్ట్‌బస్టర్లు అయిన నేపథ్యంలో ఐటెం సాంగ్ అంటే తమన్నానే ఫస్ట్ ప్రియారిటీగా మారిపోయింది.
అందానికి అందం, ఐటెం సాంగ్స్ విషయంలో మంచి సక్సెస్ ఉండటంతో అమ్మడు తన రేటును కూడా భారీగా పెంచి ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. సినిమా కోసం ఎక్స్‌పోజింగ్ విషయంలో కూడా ఎలాంటి లిమిట్స్ పెట్టుకోనందున నిర్మాతలు కూడా మిల్కీ బ్యూటీ అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం తమన్నా వరుస బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.