మిల్కీ బ్యూటీ తమన్నాకు 2023 లో అయినా హిట్టు దక్కేనా?
2005 లో హిందీ లో చాంద్ సా రోషన్ ఛేహెరా, తెలుగు లో శ్రీ చిత్రంతో పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా ఒక వైపు గ్లామర్ పాత్రల్లో కనిపిస్తూనే మరో వైపు ‘బాహుబలి’, ‘సైరా’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ ఏడాది ఆమె నటించిన ఘనీ, ఎఫ్3, బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఎ – ప్లాన్ బి వరుస ప్లాపుల రికార్డు సాధించింది. ఇక 2023 లో హిట్ కొట్టడానికి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గుర్తుందా శీతాకాలం, బోలె చుడీయా, షూటింగ్ జరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం భోళా శంకర్, మలయాళ మూవీ బాంద్రా లో నటిస్తుంది ఈ మిల్కీ బ్యూటీ.
Click here for Tamanna Photogallery













