Syeyara: సైయారా కాంబినేషన్ లో మరో సినిమా?

చాలా కాలంగా బాలీవుడ్ లో మ్యూజికల్ రొమాంటిక్ ఫిల్మ్ లేదని అనుకుంటున్న కాలంలో సైయారా(Syeyara) సినిమా వచ్చింది. మోహిత్ సూరి(Mohith Suri) దర్శకత్వంలో అహాన్ పాండే(Ahaan Pandey), అనీత్ పద్దా(Aneeth padda) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్(Yash raj films) నిర్మించింది. ఏ మాత్రం అంచనాల్లేకుండా చిన్న సినిమాగా వచ్చిన సైయారా భారీ బ్లాక్ బస్టర్ అయింది.
ఇంకా చెప్పాలంటే సైయారా సినిమా అనీత్, అహాన్ ను ఓవర్ నైట్ లో స్టార్లు గా మార్చేసింది. ఇప్పటికీ సైయారా కొన్ని ఏరియాల్లో సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న మోహిత్ సూరి, అహాన్, అనీత్ మరోసారి కలిసి వర్క్ చేయబోతున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా అహాన్ పాండే, అనీత్ పద్దా మోహిత్ సూరి ఇంట్లో కలిసి కనిపించడంతో బీ టౌన్ వర్గాల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. వీరందరూ కలిసి మరో సినిమా చేయనున్నారని, సైయారా సినిమా హిట్ అవడంతో వీరందరికీ మంచి సింక్ కుదిరిందని, అందుకే ముగ్గురూ కలిసి మరో ప్రాజెక్టు కోసం డిస్కస్ చేస్తున్నారని, ఈ సినిమా కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థే నిర్మించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.