మెగాస్టార్ అభిమానులకు శుభవార్త
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్ చరణ్ నిర్మాత. చిత్రీకరణ దాదాపు పూర్తయింది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి. ప్రస్తుతం చిరంజీవి డబ్బింగ్ థియేటర్లో బిజీగా ఉన్నారు. అక్టోబరు 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. అందుకు తగినట్టుగానే నిర్మాణానంతర కార్యక్రమాల్ని వేగవంతం చేశారు. ప్రముఖ నాయిక అనుష్క ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఆమెపై సన్నివేశాల్ని తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలు, పోరాట ఘట్టాలకు ఎక్కువ ప్రాధాన్యమున్న చిత్రమిది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం విదేశీ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. ఈలోగా కీలక పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.













