స్వయంవద టీజర్ ను విడుదల చేసిన కల్యాణ్
ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా నటిస్తున్న చిత్రం స్వయంవద. వివేక్ వర్మ దర్శకుడు. రాజా దుర్వాసుల నిర్మిస్తున్న ఈ టీజర్‌ని నిర్మాత సి.కల్యాణ్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో హారర్ జోనర్ చిత్రాలు మంచి ఫలితాల్ని సాధిస్తున్నాయి. ఆ కోవలో ఈ సినిమా కూడా విజయం సాదించాలని ఆశిస్తున్నాను అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ హారర్ థ్రిల్లర్ సైన్స్ ఫిక్షన్ అంశాల చుట్టూ కథ సాగుతుంది. ఇదొక క్లీన్ ఎంటర్టైనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అనికా రావు, లోహిత్, రామ్ జగన్, బెక్కెం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.













