కార్తికేయ2 లో స్వాతి ఉన్నట్లా..? లేనట్లా..?
నిఖిల్ హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ నడిచే కథతో కూడిన ఈ సినిమాలో స్వాతి కథానాయికగా అలరించింది. కథాకథనాల పరంగా, చిత్రీకరణ పరంగా, సంగీత పరంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ భారీ వసూళ్లతో మంచి విజయాన్ని నమోదు చేసింది. నిఖిల్, స్వాతి కెరీర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది.
ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేయడానికి లాక్ డౌన్ కి ముందే ప్రయత్నాలు జరిగాయి. లాక్ డౌన్ కారణంగా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకుండానే ఆగిపోయిన ఈ ప్రాజెక్టు మళ్లీ ఇటీవలే మొదలైంది. గుజరాత్ ప్రాంతంలో షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే కార్తికేయ సినిమాలో కథానాయికగా మెప్పించిన స్వాతి పెళ్లైన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఆమె ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనుందనే టాక్ సీక్వెల్ మొదలు పెట్టిన రోజే వచ్చింది. ఇక మెయిన్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ అలరించనుందనే వార్తలు షికారు చేశాయి.
ఇప్పుడు కార్తికేయ2 ప్రాజెక్ట్ మొదలుకావడంతో మళ్లీ ఈ విషయంపై అందరిలో ఆసక్తి పెరుగుతుంది. ఆల్రెడీ నిఖిల్ జోడీగా 18పేజెస్ చేస్తున్న అనుపమ మళ్లీ కార్తికేయ2 లో కూడా చేయనుందా? చందూ, నిఖిల్ లతో ఉన్న సాన్నిహిత్యంతో అయినా స్వాతి ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే నిఖిల్ సరసన నటించే అవకాశం స్వాతి కంటే ప్రియాంక అరుళ్ మోహన్ కే ఎక్కువనే టాక్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.













