సూర్య కంగువా.. వామ్మో అన్ని భాషల్లోనా?
ఈ మధ్య స్టార్ హీరో నుంచి ఏ సినిమా వస్తున్నా సరే అది పాన్ ఇండియా సినిమాలనే తెరకెక్కుతుంది. అయితే పాన్ ఇండియా సినిమా అంటే ఇండియా మొత్తం కలుపుకుని ఓ అయిదారు భాషల్లో రిలీజ్ అవడమే అందరికీ తెలుసు. ఇంకా లేదంటే మరో నాలుగైదు భాషలు యాడ్ అవుతాయి. కానీ వరల్డ్ వైడ్ వాడుకలో ఉన్న 38 భాషల్లో ఒక సినిమాను డబ్బింగ్ చేయడమంటే మాటలు కాదు.
తమిళ హీరో సూర్య నటిస్తున్న కంగువా ఈ సాహసం చేయబోతుంది. రీసెంట్గా ఈ విషయాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా వెల్లడించాడు. అంతేకాదు కంగువా కోసం ఐమ్యాక్స్, త్రీడీ వెర్షన్స్ కూడా స్పెషల్ గా రెడీ చేస్తున్నారు. కంగువా మొదలుపెట్టినప్పుడు ముందు 10 భాషలే అన్నారు కానీ ఇప్పుడు మరో 28 భాషలు యాడ్ అయ్యాయంటే బడ్జెట్ పరంగా కంగువా కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
సిరుత్తై శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం సూర్య నెలలు తరబడి డేట్స్ కేటాయించడమే కాకుండా మరో సినిమా జోలికి పోకుండా డెడికేటెడ్ గా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా విదేశాల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. టీజర్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం పై కూడా ఫ్యాన్స్ చాలానే అంచనాలు పెట్టుకున్నారు. మరి కంగువా 38 భాషల్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.













