Suriya46: భారీ రేటుకు సూర్య46 ఓటీటీ రైట్స్
తమిళ హీరో అయినప్పటికీ సూర్య(suriya)కు తెలుగులో కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ గత కొన్ని సినిమాలుగా సూర్య ఫామ్ లో లేడు. ఆయన చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే వస్తుంది. దీంతో నెక్ట్స్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఎంతో కసిగా ఉన్న సూర్య, తర్వాతి సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky atluri)తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
వాస్తవానికి సూర్య ఎప్పట్నుంచో తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయాలనుకుంటున్నాడు కానీ అది ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చింది. ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సూర్య కెరీర్లో 46(suriya46)వ సినిమాగా రూపొందుతుండగా, ప్రేమలు(Premalu) ఫేమ్ మమిత బైజు(mamitha byju) ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్(netflix) సొంతం చేసుకుందని సమాచారం. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం సూర్య 46 ఓటీటీ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ నిర్మాతలకు రూ.85 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య ఫామ్ లో లేకపోయినా సూర్య46కు ఈ రేంజ్ ఓటీటీ డీల్ జరిగిందంటే సినిమాపై క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది.







