అంత తొందరెందుకు సూర్య?
తమిళ హీరోల్లో భిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సూర్య చేసిన ప్రయోగాలు మరే ఇతర హీరో చేసి ఉండడు. ఓ వైపు డిఫరెంట్ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో మాస్ సినిమాలు చేయడం సూర్యకు అలవాటు. తమిళ్ లో డైరెక్టర్ హరితో చేసిన సినిమాలు అలాంటివే. అయితే ఇప్పుడు సూర్య బోయపాటి శ్రీనుతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
వీరి కాంబోలో సినిమా వస్తుందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తుండగా, తాజాగా ఈ కాంబోలో సినిమా ఓకే అయిందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని ప్రచారం జరుగుతుంది. రీసెంట్గా బోయపాటి చెప్పిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అయితే ఈ సినిమా విషయంలో సూర్య తొందరపడ్డాడని అందరూ అంటున్నారు.
బాలకృష్ణతో తప్ప మరే హీరోతో తనకు చెప్పుకోదగ్గ హిట్లు లేవు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వస్తున్న స్కంద సినిమాకు కూడా అనుకున్న రేంజ్లో బజ్ లేదు. బోయపాటి ట్రాక్ రికార్డు చూసి సూర్య ఈ విషయంలో తొందరపడ్డాడని, కనీసం స్కంద రిజల్ట్ వచ్చే వరకు అయినా ఆగాల్సిందంటున్నారు. అయితే అసలు సూర్య, బోయపాటి కాంబోలో మూవీ గురించి వస్తున్న వార్తల్లో నిజమెంతన్నది అందరికీ డౌటే.













