ఢిల్లీతో రోలెక్స్ వార్
రోలెక్స్ గురించి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జపాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన సూర్య రోలెక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కనగరాజ్ తనకు ఇచ్చిన రోలెక్స్ క్యారెక్టర్ పూర్తిగా తన కెరీర్‌ను మార్చేసిందని, ఢిల్లీ ఎప్పుడైతే రిటర్న్ అవుతాడో అదే టైమ్ లో రోలెక్స్ కూడా తిరిగి వస్తాడని సూర్య అన్నారు.
సూర్య వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే ఖైదీ2లో రోలెక్స్ క్యారెక్టర్ చాలా బలంగా ఉండబోతుందని తెలుస్తోంది. అన్నదమ్ముల మధ్య ఖైదీ2లో వార్ ఓ రేంజ్ లో ఉండనుందని సూర్య మాటల ద్వారా అర్థమవుతోంది. ఇదే లోకేష్ యూనివర్శ నుంచి విక్రమ్-2 కూడా రాబోతుంది. ఇదంతా లోకేష్ సృష్టించుకున్న సినీ సామ్రాజ్యం.
అందులో నుంచి ఒక్కో సినిమాను మరో సినిమాతో ఇంటర్‌లింక్ చేస్తూ ఉంటాడు లోకేష్. లోకేష్ యూనివర్శ్ సక్సెస్ అయినంత వరకు దీన్ని కంటిన్యూ చేస్తాడు. లేదంటే కొత్త కథలతో సినిమాలు చేస్తాడు. ప్రస్తుతం లోకేష్, రజినీకాంత్ సినిమాపై వర్క్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా కూడా లోకేష్ యూనివర్శ్‌లో భాగంగా వస్తుందా లేదా అనేది చూడాలి.













