ఆ స్పీడేంటి సూర్యా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లను ప్లాన్ చేసే దిశగా సూర్య ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే తన 43వ సినిమా కంగువ(Kanguva)ను రిలీజ్ కు రెడీ చేశాడు సూర్య. కంగువ నవంబర్ లో రిలీజ్ కానుంది. కంగువ సెట్స్ లో ఉండగానే కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) తో తన 44వ సినిమాను లాక్ చేసుకున్నాడు సూర్య.
కంగువ రిలీజ్ అవకముందే సూర్య44(Suriya44) సినిమాను కూడా పూర్తి చేసేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సూర్య45(Suriya45)కు రంగం సిద్ధమవుతుంది. సూర్య44 సెట్స్ లో ఉండగానే ఆర్జె బాలాజీ(RJ Balaji) చెప్పిన స్టోరీకి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డిసెంబర్ నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ ను వెతికే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉందట.
దీంతో సూర్య సినిమాల వేగం చూసి అందరూ షాకవుతున్నారు. మామూలుగా కంగువ లాంటి వార్ మూవీ చేశాక ఏ హీరో అయినా కనీసం రెండు మూడు నెలల పాటూ రెస్ట్ తీసుకుని వెకేషన్స్ కు వెళ్లి తర్వాతి సినిమాను మొదలుపెడతారు కానీ సూర్య మాత్రం రెస్ట్ అన్నదే లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. కంగువ నవంబర్ లో రిలీజ్ కానుండగా, సూర్య44 సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత సమ్మర్ కు సూర్య45ను రిలీజ్ చేసేలా సూర్య పక్కా ప్లానింగ్ తో సినిమాలను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాడు.













