Suriya: నా జీవిత ఉద్దేశం అదే!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) హీరోగా నటించిన తాజా సినిమా రెట్రో(Retro). పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వం వహించాడు. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా మేకర్స్ రెట్రో ట్రైలర్(retro trailer) ను రిలీజ్ చేశారు. మామూలుగా ఏ సినిమా ట్రైలర్ అయినా సినిమా కథ గురించి క్లారిటీ ఇస్తుంది.
కానీ రెట్రో ట్రైలర్ లో అలాంటి క్లారిటీ లేకపోగా, లేనిపోని కన్ఫ్యూజన్ మొదలవుతుంది. మేకర్స్ కావాలనే ట్రైలర్ ను అలా కట్ చేశారని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ప్రతిఒక్కరూ రెట్రో ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ట్రైలర్ లో సినిమా కథ గురించి చెప్పకపోయినా ఆడియో లాంచ్ లో సూర్య రెట్రో ముఖ్య ఉద్దేశమేంటో వెల్లడించాడు.
మన జీవితాల ముఖ్య ఉద్దేశాలను హైలైట్ చేస్తూ రెట్రో సినిమా తెరకెక్కిందని, తన జీవిత ముఖ్య ఉద్దేశం అగరం ఫౌండేషన్(Agaram Foundation) అని, అందరి ప్రేమ వల్ల ఆ ఫౌండేషన్ నున తాను సరిగ్గా నడపగలుగుతున్నానని, ఇప్పటివరకు ఆ ఫౌండేషన్ నుంచి 8వేల మంచి పట్టభద్రులయ్యారని, మరెంతో మంది కూడా తమ ఫౌండేషన్ నుంచి పట్టభద్రులు కానున్నారని సూర్య తెలిపాడు. తమ సినిమాలో నవ్వు, ప్రేమ, యుద్ధం లాంటి ఎన్నో లేయర్స్ ఉన్నాయని, రెట్రో ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందని సూర్య చెప్పాడు. ఈ సినిమాలో శ్రియా(Sriya) స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.













