కాలాకు సుప్రీంకోర్టులో ఊరట
ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కానున్న కాలా చిత్రాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు తిరస్కరించింది. సినిమా విడుదలను వ్యతిరేకిస్తూ ఎ.కె.రాజశేఖరన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎ.కె గోయల్, అశోక్ భూషణతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. మీరు విడుదలకు వ్యతిరేకంగా నిషేధాన్ని కోరుతున్నారు. కానీ ప్రతీఒక్కరూ సినిమా విడుదల కావాలని కోరుకుంటున్నారు అని పిటిషన్ దారుడితో బెంచ్ పేర్కొంది. ఈ సినిమా కథ, కథనాలు, కాపీ రైట్ను గల తన నుండి అనుమతి తీసుకోకుండా సినిమా తీశారని పిటిషన్‌దారుడి ఆరోపణ. సినిమా విడుదలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై గత నెల 16న మద్రాస్ హైకోర్టు ఈ ఈనెల 16కి విచారణ చేపడతామని వాయిదా వేసింది. దీంతో పిటిషన్‌దారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.













