క్రేజీ ఆఫర్ ను పట్టేసిన సందీప్ కిషన్
ఇటీవలే ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సందీప్ కిషన్, ఆ సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చుకుని సక్సెస్ దిశగా అడుగులేస్తున్నాడు. ఈ సినిమా సందీప్ అకౌంట్ లో మరో హిట్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సందీప్ తన తర్వాతి సినిమాను త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. దీంతో పాటూ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా సందీప్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే కాంబోలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 1, ఫ్యామిలీ మెన్2 సిరీస్ కు ఇప్పుడు సీక్వెల్ గా సీజన్ 3 రాబోతుంది. త్వరలోనే దీన్ని పట్టాలెక్కించాలని ఈ డైరెక్టర్లిద్దరూ ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇందులో సందీప్ కిషన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత విలన్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు ఫ్యామిలీ మెన్ 3 స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. అందులో సందీప్ కిషన్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడనేది క్లారిటీ లేదు. ఇప్పటికే ధనుష్ రాయన్ సినిమాలో మంచి ఆఫర్ కొట్టేసిన సందీప్ కిషన్ ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను పట్టేశాడు. చూస్తుంటే సందీప్ కు లక్ బాగానే కలిసొస్తున్నట్లుంది.













