Suma: ఆశామేరీగా సుమ మెప్పిస్తుందా?

కొన్ని సార్లు సినిమాల్లో హీరోహీరోయిన్ల కంటే మిగిలిన క్యారెక్టర్ మీదే ఇంట్రెస్ట్ నెలకొంటుంది. ఇప్పుడు ఇంచుమించు అలాంటి పరిస్థితే ఓ సినిమాకు ఎదురైంది. ప్రియదర్శి(priyadarshi), ఆనంది(aanandhi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ప్రేమంటే(premante). రొమాంటిక్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ మూవీతో నవనీత్ శ్రీరామ్(navaneeth sriram) దర్శకుడిగా పరిచయమవుతుండగా, అక్టోబర్ 24న ప్రేమంటే రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమాలో నటి, యాంకర్ సుమ(suma) ఓ కీలక పాత్రలో నటించింది. సుమ యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాను నటించే పాత్రకు మంచి కామెడీని జోడించి తనదైన స్టైల్ లో యాక్ట్ చేయడంలో సుమ స్పెషలిస్ట్. సుమ నుంచి ఆఖరిగా వచ్చిన జయమ్మ పంచాయితీ(jayamma panchayathi) మూవీలో కూడా ఆమె అదే తరహాలో కనిపించారు. ఆ సినిమా ఫ్లాపైనా సుమకు మాత్రం ఆ అటెంప్ట్ కు మంచి పేరే వచ్చింది.
ఇక ప్రేమంటే మూవీ విషయానికొస్తే ఈ మూవీలో సుమ, ఆశా మేరీ(asha meri) అనే పోలీస్ పాత్రలో కనిపించి నవ్వించనుంది. పోలీస్ గా ఉంటూ కూడా సుమ తన క్యారెక్టర్ ను చాలా అద్భుతంగా పండించిందని, కొన్ని సీన్స్ లో సుమ తన టైమింగ్ తో మెయిన్ క్యాస్టింగ్ ను కూడా మించి కనిపిస్తుందని యూనిట్ సభ్యులంటున్నారు. మరి ఈ మూవీతో సుమ ఆడియన్స్ ను ఏ మేర ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.