Suma: రిటైర్మెంట్ వార్తలపై రియాక్ట్ అయిన సుమ
తెలుగు బుల్లితెరపై సుమ కనకాల(suma kanakala) ఓ సెన్సేషన్. దాదాపు 30 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉంటున్న సుమ, 20 ఏళ్లుగా స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు. సుమ వయసు 50 ఏళ్లకు పైబడినా ఆమె మాత్రం రెట్టింపు ఉత్సాహంతో యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తూనే ఉన్నారు. మలయాళ అమ్మాయి అయినప్పటికీ ఆమె తెలుగు మాట్లాడే తీరు, కామెడీ టైమింగ్, ఆమె ఎనర్జీకి అందరూ ఫిదా అయిపోయి, సుమను తమ ఇంటి అమ్మాయిగా భావిస్తారు.
కాగా గత కొన్నాళ్లుగా సుమ రిటైర్మెంట్ గురించి టాలీవుడ్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. సుమ వయసు అయిపోతుందని, ఆమె తర్వాత ఆ స్థాయికి ఎవరొస్తారనే దానిపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే తన రిటైర్మెంట్ వార్తలపై రీసెంట్ గా సుమ రియాక్ట్ అయి కౌంటర్ తో పాటూ క్లారిటీ ఇచ్చారు. సుమ నటించిన ప్రేమంటే(premante) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు.
తన తల్లికి 81 సంవత్సారాలని, ఇప్పటికీ ఆమె చాలా యంగ్ గా ఉంటారని, తన తల్లే ఇంకా రిటైర్మెంట్ ఇవ్వనప్పుడు తానెందుకు రిటైర్ అవాలని ప్రశ్నించిన సుమ, తన ఫ్యామిలీ జీన్స్ చాలా స్ట్రాంగ్ అని, తన అమ్మమ్మ 101 ఏళ్లు బ్రతికారని, తన పెద్ద మామయ్యకు 99 ఏళ్లు అని ఇప్పటికీ ఆయన అడ్వకేట్ గా వర్క్ చేస్తున్నారని, కాబట్టి తాను ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని క్లారిటీ ఇవ్వగా సుమ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






