OG: సుజిత్.. అదే ఫోకస్ సినిమాపై చేస్తేనా..?

పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా, సుజిత్(sujeeth) దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఓజి(OG). గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచే ఆడియన్స్ కు దీనిపై భారీ అంచనాలున్నాయి. దానికి కారణం సుజిత్ కూడా పవర్ స్టార్ కు ఫ్యాన్ అవడమే. అభిమాన హీరోను ఎలా అయితే చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారో సుజిత్ అలానే చూపిస్తాడని వారంతా అభిప్రాయపడుతున్నారు.
వారి అంచనాలకు తగ్గట్టే సుజిత్ ఓజి విషయంలో ఎంతో కేర్ తీసుకుటూ ప్రతీదీ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు ఓజి నుంచి వచ్చిన ప్రోమోలు, టీజర్, సాంగ్స్ ప్రతీదీ ఫ్యాన్స్ నుంచి ఆడియన్స్ వరకు ప్రతీదీ ఇంప్రెస్సివ్ గా ఉండాలని ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఓజి విషయంలో సుజిత్ తీసుకుంటున్న కేర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
ఓజి కోసం సుజిత్ చాలా కష్టపడుతున్నాడు. మధ్యలో పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ ఆగిపోయినప్పటికీ సుజిత్ మాత్రం తన ధ్యాసంతా ఈ సినిమాపైనే పెట్టి ఓజిని ఇంకా బెటర్ గా ఎలా ప్రెజెంట్ చేయొచ్చని వర్క్ చేశారు. సుజిత్ ప్రోమోలు, టీజర్, సాంగ్స్ కోసం తీసుకున్న జాగ్రత్తలే సినిమా విషయంలో కూడా తీసుకుని ఉంటే ఓజి సూపర్ హిట్ అవడంతో పాటూ రికార్డులు సృష్టించడం ఖాయం.