Allu Arjun: బన్నీ ని మెప్పించిన సుజిత్?

గత కొంత కాలంగా హిట్ కోసం ఎంతో మొహం వాచిపోయిన పవన్ కళ్యాణ్(pawan kalyan) ఫ్యాన్స్ ఆశను, ఆకలిని ఓజి(OG) సినిమాతో డైరెక్టర్ సుజిత్(Sujeeth) తీర్చేశారు. ఓజి సినిమాతో పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టిన సుజిత్ ఈ మూవీతో కేవలం ఫ్యాన్స్ నుంచే కాకుండా సాధారణ ఆడియన్స్ నుంచి, సెలబ్రిటీల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఓజి సినిమాను ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు చూడగా, రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) కూడా చూశారు. సినిమా చూశాక బన్నీ ఈ మూవీపై ఏదొక రివ్యూ ఇస్తాడనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. అయితే సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఓజి సినిమాను బన్నీ(bunny) చాలా ఎంజాయ్ చేశాడని, సుజిత్ డైరెక్షన్ కు బన్నీ ఫిదా అయిపోయాడని తెలుస్తోంది.
అన్నీ కుదిరితే సుజిత్ తో బన్నీ సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే విధంగా చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్లతో వర్క్ చేయడానికి ఇష్టపడతాడు. పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న బన్నీ, దృష్టిలో నిజంగా సుజిత్ పడి, అతనికో అవకాశమిస్తే మాత్రం సుజిత్ కు కెరీర్లో అదే పెద్ద సినిమా కావడం ఖాయం. కాగా బన్నీ ప్రస్తుతం అట్లీ(atlee)తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.