భలే ప్లాన్ చేసిన సుజిత్!
సాహో సినిమా తర్వాత మరో సినిమాను పట్టాలెక్కించడానికి డైరెక్టర్ సుజిత్ చాలానే టైమ్ తీసుకున్నాడు. తను తీసుకున్న గ్యాప్ కు న్యాయం జరిగేలా ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా పూర్తి చేసే లోపే నేచురల్ స్టార్ నానితో సినిమా చేసే ఛాన్స్ అందుకుని మరో బంపరాఫర్ అందుకున్నాడు.
మొన్నటివరకు కేవలం సినిమా ఉంటుందని మాత్రమే లీక్స్ అందాయి. అయితే ఈ సినిమా ను నాని బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోను చూస్తుంటే హింసాత్మక బాటలో నడిచే వ్యక్తి, వందలాది మంది మీద పడినా అందరినీ మట్టి కరిపించే సత్తా ఉన్నప్పటికీ సడెన్ గా వెపన్స్ వదిలేసి ఫుడ్ ట్రక్ పెట్టుకుని కొత్త లైఫ్ ను గడిపితే ఎలా ఉంటుందనే పాయింట్ మీద కథ నడవనుందని అర్థమవుతుంది.
స్టోరీ లైన్ ఎలా ఉన్నా సినిమాలో ట్విస్టు, ఎలివేషన్స్, స్క్రీన్ ప్లే ను ఓ రేంజ్ లో ప్లాన్ చేశాడట సుజిత్. సాహో సినిమాలో ముంబై టీమ్ ప్రమేయం ఎక్కువ అవడం వల్లే సినిమా బ్యాలెన్స్ తప్పిందని చాలా మంది ఇప్పటికీ అంటుంటారు. ఇప్పుడు ఓజి సినిమాకు సుజిత్ కు ఆ బాధ తప్పింది. ఈ సినిమా విషయంలో అతనికి ఫుల్ ఫ్రీడమ్ దొరికింది. అందుకే పవన్ చేస్తున్న సినిమాలను అన్నింటిని పక్కన పెట్టి మరీ ఈ సినిమాను ముందుగా ఫినిష్ చేయాలని డిసైడయ్యాడు. అంతే కాదు డివివి దానయ్య లాంటి డైరెక్టర్ వరుసగా రెండు పెద్ద సినిమాలను అతనితో తీయడానికి నిర్ణయించుకున్నాడంటే సుజిత్ ప్లానింగ్ మామూలుగా లేదు. ఈ రెండు సినిమాలు మంచి టాక్ ను తెచ్చుకుంటే సుజిత్ స్టార్ డైరెక్టర్ అవడం ఖాయం.













