అంత రిస్క్ అవసరమా సుహాస్
తక్కువ గ్యాప్ లో ఒకే హీరో నుంచి రెండు సినిమాలు రావడం ఇప్పుడున్న సిట్యుయేషన్స్ లో సేఫ్ ఏ మాత్రం కాదు. రీసెంట్ గా రాజ్ తరుణ్ తప్పని పరిస్థితుల్లో ఇలానే రిలీజ్ చేసి ఒకదాన్ని మించి మరోటి డిజాస్టర్లుగా మిగుల్చుకున్నాడు. అలా అని అన్ని సినిమాలకు ఇదే జరుగుతుందని కాదు కానీ మార్కెట్ యాంగిల్ లో చూసుకుంటే ఆడియన్స్ ముందుకు వెంటవెంటనే వస్తే ఇమేజ్ పరంగా రిస్క్ జరిగే ఛాన్స్ కూడా ఉంది.
ఇప్పుడు ఆ రిస్క్ చేయడానికి టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ రెడీ అయ్యాడు. దిల్ రాజు బ్యానర్ లో నటించిన జనక అయితే గనక ఈ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాకు బజ్ పెంచుతుంది. ఈ సినిమా కచ్ఛితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ మొత్తం ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజైన రెండు వారాలు తిరక్కుండానే సుహాస్ నటించిన మరో సినిమా గొర్రె పురాణంను సెప్టెంబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేపర్ యాడ్స్ ఇచ్చారు. రెండు సినిమాలకు గ్యాప్ తక్కువ ఒక రిస్క్ అయితే ఈ సినిమా రిలీజయ్యాక వారంలోపు ఎన్టీఆర్ దేవరతో థియేటర్లకు రానున్నాడు. సుహాస్ సినిమా హిట్ అయినా సరే దేవర వచ్చాక ఈ సినిమాకు థియేటర్లు తగ్గిపోతాయి. మరి ఈ నేపథ్యంలో గొర్రె పురాణం టీమ్ రిలీజ్ డేట్ విషయంలో మనసు మార్చుకుంటారో లేదో చూడాలి.













