సుహాస్ సినిమాకు పెరుగుతున్న బజ్
సుహాస్ హీరోగా ఫిబ్రవరి 2న రిలీజ్ కాబోతున్న అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా పై క్రమంగా బజ్ పెరుగుతుంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ సినిమాకు ప్రీమియర్ షోలు వేయాలని మేకర్స్ ఇప్పటికే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సుహాస్ గత చిత్రం రైటర్ పద్మభూషణ్ కు కూడా ఇదే తరహాలు షోలు వేస్తే మంచి రెస్పాన్స్ వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.
అందుకే ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ అంబాజీపేట మ్యారేజి బ్యాండు ప్రీమియర్స్ కు ప్లాన్ చేస్తోంది. ఫిబ్రవరి 2న పెద్ద పోటీ లేకపోయినా మరో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ తర్వాత వారం ఈగల్, యాత్ర2 రిలీజవుతున్నాయి. కాబట్టి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అంబాజీపేట మ్యారేజి బ్యాండుకు కీలకం కానున్నాయి.
సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రెండో వారంలో థియేటర్లకు కొదువ ఉండదు. దుశ్యంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్స్ లో ఉందని ఇన్ సైడ్ టాక్. బిజినెస్ ఎంత చేశారన్నది ఇంకా బయటకు తెలియదు కానీ ఏరియాల వారీగా మంచి రేట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే సుహాస్ హీరోగా మరో మెట్టు ఎక్కినట్లే.













