క్రేజీ కాంబినేషన్ లో సుహాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్..!?
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు సుహాస్. తన పేరుతో కంటే కలర్ ఫోటో సినిమా హీరో గా టాలీవుడ్ ప్రేక్షకులకి సుపరిచితుడు ఈ హీరో. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ఐడెంటిటీ ని క్రీయేట్ చేసుకున్న టాలెంటెడ్ హీరో సుహాస్. కెరీర్ స్టార్టింగ్ లో పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించి అతిధి అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసాడు. స్టార్ హీరోలకి ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తూ వచ్చాడు.
టాలెంట్ ఏ రూపంలో ఉన్నా ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అదే విధంగా సుహాస్ కి తన ప్రతిభని ని చూపించుకోడానికి మంచి ప్లాట్ ఫామ్ దొరికింది. ఒక్క ” కలర్ ఫోటో ” సినిమా ఈ నటుడి కెరీర్ నే మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. లాక్ డౌన్ టైం లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజయ్యింది ఈ సినిమా. ఫస్ట్ సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్ ని తన నటనతో కట్టిపడేసాడు సుహాస్. తర్వాత చిన్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారిపోయి నిర్మాతలకి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ” రైటర్ పద్మభూషణ్ ” కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి స్టార్ హీరోల ప్రశంసలు అందుకుంది.
తాజాగా రైటర్ పద్మభూషణ్ హిట్ తర్వాత సుహాస్ కి అదిరిపోయే బంపర్ ఆఫర్ వచ్చిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గీత ఆర్ట్స్ బ్యానర్ పై సుహాస్ హీరోగా సందీప్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ కి ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఆల్రెడీ డైరెక్టర్ అండ్ హీరో కాంబో లో కలర్ ఫోటో సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు తెలుస్తుంది. మరోసారి రిపీట్ అవ్వబోతున్న ఈ క్రేజీ కాంబినేషన్ పై ఆడియన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.













