Subham: సమంత శుభం ట్రైలర్ టాక్
సమంత(Samantha) నిర్మాతగా మారి చేస్తున్న సినిమా శుభం(Subham) సినిమా టీజర్ తోనే మంచి అంచనాలను ఏర్పరచుకుంది. మే 9న శుభం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. 2.50 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
భార్యను ఎలా కంట్రోల్ చేయాలని ముగ్గురు భర్తల చర్చలతో మొదలైన ట్రైలర్ తర్వాత శోభనం గదిలో స్టార్ట్ అవుతుంది. ఆ గదిలో తనను తాను ఆల్ఫా మగాడని నిరూపించుకోవాలని వరుడు ట్రై చేస్తుంటాడు. అతను చెప్పేదంతా అప్పటివరకు సైలెంట్ గా విన్న వధువు తర్వాత సీరియల్ చూస్తూ తనలోని కొత్త యాంగిల్ ను బయటపెడుతుంది. అంతే ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోతాయి.
ట్రైలర్ చూస్తుంటే ఆడవాళ్ల సీరియల్స్ వ్యసనానికి హార్రర్, కామెడీని మిక్స్ చేసి డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల(Praveen Kandregula) ఈ సినిమా తీసినట్టుంది. ఊరు మొత్తానికి ఇదే సమస్య ఎదురైతే వచ్చే సమస్యేంటి? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారనేదే సినిమాగా తెలుస్తోంది. ట్రైలర్ ఎండింగ్ లో సమంత ఇచ్చిన ఎంట్రీ అందరినీ సర్ప్రైజ్ చేసింది. మొత్తానికి ట్రైలర్(Subham Trailer) మాత్రం శుభంపై అంచనాలను పెంచేదిలానే ఉంది. మరి నిర్మాతగా సమంత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.






