Salaar: సలార్ ఫైట్ ను రీక్రియేట్ చేసిన స్టూడెంట్స్
సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఆడియన్స్ కు ఏ కంటెంట్ ఎప్పుడు నచ్చుతుందో అంచనా వేయలేకపోతున్నాం. సోషల్ మీడియాలో ప్రతీదీ ట్రెండ్ చేయడం కామనైపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సలార్(Salaar) సినిమాలోని ఓ ఫైట్ సీన్ నెట్టింట వైరలవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమాను హోంబళే ప్రొడక్షన్స్(Hombale Films) బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శృతి హాసన్(Shruthi Haasan) హీరోయిన్ గా నటించింది. సలార్ రిలీజైన టైమ్ లో ఎంతటి సంచలనాలు సృష్టించిందో మళ్లీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అయితే ఈ సినిమాలోని కోల్ మైన్ ఫైట్ ఎంత ఫేమస్ అనేది తెలుసు. సినిమా రిలీజై సంవత్సరంన్నర తర్వాత అనుకోకుండా ఆ సీన్ వార్తల్లో నిలుస్తోంది. తమిళనాడులోని ఓ యూనివర్సిటీలో స్టూడెంట్స్ సలార్ సినిమాలోని కోల్ మైన్ ఫైట్ ను రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. మామూలుగా ఎవరైనా సినిమాల్లోని సాంగ్స్ కు స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తుంటారు, కానీ వాళ్లు మాత్రం సలార్ లోని ఫైట్ ను రీక్రియేట్ చేసి వార్తల్లో నిలిచారు.













