స్త్రీ2 కు రికార్డు స్థాయి బుకింగ్స్
సాహో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రద్ధా కపూర్ ఆ సినిమా డిజాస్టర్ తో తిరిగి బాలీవుడ్ కే పరిమితమైపోయింది. తాజాగా స్త్రీ2 సినిమాతో ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది శ్రద్ధా కపూర్. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ స్త్రీ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. స్టార్ హీరో లేకపోయినా ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
రిలీజ్ ఇంకా అయిదు రోజులుండగానే ఈ సినిమాకు లక్ష టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడైపోయాయి. ఆగస్ట్ 15న మార్నింగ్ షో పడేలోపు ఈ లెక్క ఈజీగా 4 లక్షల వరకు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. అయితే దీన్ని ఇంత ప్రత్యేకంగా చెప్పడానికి కారణం లేకపోలేదు. అదే రోజున అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే సినిమా కూడా వస్తుంది. దానికి 10 వేల టికెట్స్ కూడా బుక్ కాలేదు.
స్త్రీ2 కంటే ఎక్కువగా ఆ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ అక్షయ్ కుమార్ ట్రాక్ రికార్డు వల్ల ఈ సినిమాకు బజ్ రావడం లేదు. అక్షయ్ సినిమా కంటే జాన్ అబ్రహం వేదా సినిమాకు కొంచెం బెటర్ గా బుకింగ్స్ అవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా స్త్రీ2 దరిదాపుల్లో లేకపోవడం విశేషం. ఈ సినిమాకు ముందు రోజు సాయంత్రం నుంచే స్పెషల్ ప్రీమియర్లు పడబోతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే అక్షయ్ కంటే శ్రద్ధా క్రేజే ఎక్కువని అర్థం చేసుకోవచ్చు.













