Stranger Things: ఆశ్చర్యపరుస్తున్న స్ట్రేంజర్ థింగ్స్ రన్ టైమ్

సోషల్ మీడియా వాడకం పెరిగాక ఓటీటీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్ లో భాగంగానే వెబ్‌సిరీస్ లకు భారీ క్రేజ్ వచ్చింది. కొన్ని సస్పెన్స్ ఉన్న వెబ్ సిరీస్ లకు అయితే ఇక చెప్పే పన్లేదు. కాగా ఎలాంటి వెబ్ సిరీస్ అయినా కొన్ని ఎపిసోడ్స్ గా వస్తూ ఉంటుంది. ఒక్క ఎపిసోడ్ నిడివి అరగంట నుంచి గంట వరకు ఉంటుంది.
భారీ రన్ టైమ్ తో వచ్చే సిరీస్ లు చాలా రేర్ గా ఉంటాయి. అయితే ఇప్పుడో సిరీస్ భారీ ఎపిసోడ్స్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అదే స్ట్రేంజర్ థింగ్స్(Stranger things). ఈ సిరీస్ కు సంబంధించి ఇప్పటికే నాలుగు సీజన్లు రిలీజ్ అవగా, వాటన్నింటికీ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సిరీస్ నుంచి ఐదో సీజన్ రెడీ అవుతుంది.
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్5 లో ఒక్కో ఎపిసోడ్ నిడివి ఏకంగా 2 గంటల వరకు ఉంటుందని అంటున్నారు. 2 గంటల రన్ టైమ్ అంటే దాదాపు ఒక చిన్న సినిమా అంత. ఒక వెబ్ సిరిస్ ఎపిసోడ్ మరీ ఇంత రన్ టైమ్ ఏంటని కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్5 లోని ఒక్కో ఎపిసోడ్ ను 50 నుంచి 60 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి తెరకెక్కించారట. నవంబర్ 27న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్5 మొదటి వాల్యూమ్ రిలీజ్ కానుంది.