Lenin: అఖిల్ సినిమాలో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్
అందం, టాలెంట్ అన్నీ ఉన్నప్పటికీ అక్కినేని అఖిల్(Akkineni Akhil) కు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఏజెంట్(Agent) సినిమా డిజాస్టర్ గా నిలవడంతో తర్వాతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలతో పాటూ టైమ్ కూడా తీసుకున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలోనే అఖిల్ తన నెక్ట్స్ మూవీని మురళీ కిషోర్ అబ్బూరి(Murali Kishore Abburi) దర్శకత్వంలో చేస్తున్నాడు.
లెనిన్(Lenin) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజుకో వార్త వినిపిస్తుండగా తాజాగా ఈ మూవీలో ఓ ఐటెం సాంగ్ ఉందని తెలుస్తోంది. నెక్ట్స్ షెడ్యూల్ లో ఆ స్పెషల్ సాంగ్ ను తెరకెక్కించనున్నారని, ఆ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. తమన్(Thaman) సంగీతంలో వస్తున్న ఆ స్పెషల్ సాంగ్ ను మంగ్లీ(Mangli)తో పాడించాలని అనుకుంటున్నారట.
రాయలసీమ బ్యాక్డ్రాప్లో చిత్తూరు ప్రాంత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ మాడ్యులేషన్ కూడా చిత్తూరు యాసలోనే ఉండనుందని అంటున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేమకథా చిత్రంగా రానుండగా, అఖిల్ ఈ మూవీపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు.







