SSMB29: ఆగస్ట్ నుంచి ఎస్ఎస్ఎంబీ29 కీలక షెడ్యూల్
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) ప్రస్తుతం రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఎదురుచూస్తున్నప్పటికీ మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది లేదు. అయినప్పటికీ ఎస్ఎస్ఎంబీ29(SSMB29) పై అందరికీ మంచి అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే రీసెంట్ గా మహేష్ బాబు కొలంబో వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. మహేష్ ఎందుకు కొలంబో వెళ్లాడనేది తెలియక పలువురు పలు రకాలుగా అనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం మహేష్ కొలంబో వెళ్లింది సితార(Sithara) బర్త్ డే కోసమని, ఈ సందర్భంగానే ఫ్యామిలీతో కలిసి మహేష్ వెకేషన్ ను వెళ్లాడని అంటున్నారు.
వెకేషన్ నుంచి రాగానే మహేష్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడని, ఆగస్ట్ నుంచి ఎస్ఎస్ఎంబీ29 కు సంబంధించిన కీలక షెడ్యూల్ మొదలవుతుందని, సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నారని, ఈ షెడ్యూల్ కోసం ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా తన డేట్స్ ను కేటాయించారని అంటున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.







