SSMB29: కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతున్న జక్కన్న
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) హీరోగా దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబీ29(SSMB29). ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.
అయితే రాజమౌళి ఈ సినిమాను ఇప్పటివరకు అనౌన్స్ చేసింది కూడా లేదు. కానీ షూటింగ్ ను మాత్రం చాలా సైలెంట్ గా పరుగులు పెట్టిస్తున్నాడు. ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసిన జక్కన్న(Jakkanna) ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ29 కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడట. ఈ కొత్త షెడ్యూల్ ఆగస్ట్ 21 నుంచి మొదలు కానున్నట్టు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో సినిమాలోని ప్రధాన తారాగణమంతా పాల్గొననుందని, పలు కీలక సన్నివేశాలను ఈ షషెడ్యూల్ లో రాజమౌళి తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(priyanka Chopra) ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) విలన్ గా నటిస్తున్నారని సమాచారం. వీరితో పాటూ మరికొందరు హాలీవుడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో నటించే అవకాశాలున్నాయి.







