SSMB29: ఎస్ఎస్ఎంబీ29 మళ్లీ మొదలయ్యేదెప్పుడు?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తన 29వ సినిమాను ఆర్ఆర్ఆర్(RRR) డైరెక్టర్ రాజమౌళి(Rajamouli)తో చేస్తున్న సంగతి తెలిసిందే. కనీసం అనౌన్స్‌మెంట్ కూడా లేకుండానే మొదలుపెట్టి రెండు షెడ్యూల్స్ షూటింగ్ ను పూర్తి చేశాడు రాజమౌళి. ఎస్ఎస్ఎంబీ29(SSMB29) వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం సమ్మర్ కారణంగా బ్రేక్ ఇచ్చాడు జక్కన్న(Jakkanna).
ఈ గ్యాప్ లో మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లాడు. అయితే ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ తిరిగి ఎప్పట్నుంచి మొదలవుతుందనే దానిపై ఇప్పుడో క్లారిటీ వస్తోంది. రాజమౌళి మరియు అతని టీమ్ నెక్ట్స్ షెడ్యూల్ ను జూన్ 1 నుంచి మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్ లో హైదరాబాద్ లో ఓ స్పెషల్ సెట్ లో కొన్ని కీలక ఎపిసోడ్స్ ను రాజమౌళి షూట్ చేయనున్నట్టు సమాచారం.
ఇందులో మహేష్ బాబుతో పాటూ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా పాల్గొననుండగా ఈ షెడ్యూల్ అయ్యాక చిత్ర యూనిట్ నెక్ట్స్ షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనుందని తెలుస్తోంది. ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ ఎక్కువగా ఆఫ్రికా దేశంలో జరగనుంది. ఇప్పటికే దాని కోసం లొకేషన్స్ ను కూడా రాజమౌళి లాక్ చేసుకున్నాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.