SSMB29: ఎస్ఎస్ఎంబీ29 పై లేటెస్ట్ అప్డేట్
ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న రాజమౌళి(Rajamouli) తన నెక్ట్స్ మూవీని మహేష్ బాబు(Mahesh Babu0తో ఆల్రెడీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ షూటింగ్ మొదలుపెట్టే ముందే సినిమాను అనౌన్స్ చేసి, వాటి వివరాలను వెల్లడించే రాజమౌళి ఈసారి మాత్రం కనీసం సినిమాను అధికారికంగా ప్రకటన కూడా చేయకుండానే స్టార్ట్ చేశాడు. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(priyanka Chopra), పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithvi Raj Sukumaran) కీలక పాత్రల్లో నటిస్తుండగా, వారిద్దరూ కూడా ఆల్రెడీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అయితే ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబీ29(SSMB29) షూటింగ్ కు రీసెంట్ గా చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ పై ఇప్పుడు ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన మూడో షెడ్యూల్ ను రాజమౌళి మొదలుపెట్టాడని, ప్రియాంక చోప్రా కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయినట్టు సమాచారం. ఎవరికీ తెలియకుండా ఎంతో గోప్యంగా రాజమౌళి ఈ సినిమాను పూర్తి చేస్తున్నాడు. ప్రతీ సీన్ పర్ఫెక్ట్ గా ఉండటం కోసం షూటింగ్ కు ఎక్కువ టైమ్ తీసుకునే రాజమౌళి ఈ సినిమాను మాత్రం చాలా వేగంగా పూర్తి చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.













