పవన్ కళ్యాణ్-రానా సినిమాకి సంగీతం గురించి థమన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కాంబినేషన్ లో సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కు స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకి సూపర్ ఫామ్ లో ఉన్న థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. పిడివి ప్రసాద్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇటీవలే విడుదల అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు సంగీత దర్శకులు థమన్. ముఖ్యంగా ఏఈ సినిమాలో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉందంటూ అందరి నుండి ప్రశంశలు వస్తున్నాయి. సంగీత దర్శకుడు థమన్ మనసు పెట్టి ఈ సినిమాకు వాయించాడని కొందరు.. అభిమాన హీరో కోసం ది బెస్ట్ ను థమన్ ఇచ్చాడు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వకీల్ సాబ్ సినిమా విజయంలో థమన్ అందించిన సంగీతం కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సౌత్ లో ది బెస్ట్ సంగీత దర్శకుడిగా థమన్ పేరు మారు మ్రోగి పోతుంది.
గత కొన్ని సినిమాల నుండి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారికి అత్యంత నమ్మకస్తుడిగా మారిపోయాడు థమన్. అందుకే.. త్రివిక్రమ్ గారి సలహా మేరకు వకీల్ సాబ్ చిత్రానికి సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్ మరియు రానాలు కలిసి నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రానికి కూడా ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ గారు థమన్ తో మ్యూజిక్ ఎలా ఉండాలంటే సింహం ఈ ఫారెస్ట్ అంతా నాదే అని గర్జించినట్లుగా ఉండాలంటూ చెప్పాడట. త్రివిక్రమ్ చెప్పినట్లుగానే ఏమాత్రం తగ్గకుండా సంగీతాన్ని సమకూరుస్తున్నానని ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కు మాస్ మసాలా సంగీతాన్ని అందించి మెగా అభిమానులకు మరోసారి అలరించబోతున్నాడన్నమాట.













