Sritej: విదేశాలకు శ్రీతేజ్.. బన్నీ వాస్ కీలక నిర్ణయం
పుష్ప2(Pushpa2) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, తన కుమారుడు శ్రీ తేజ్ తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. గాయపడ్డ శ్రీతేజ్(Sri Tej)ను సికింద్రాబాద్ కిమ్స్ కు తరలించారు. దాదాపు రెండు నెలలుగా శ్రీతేజ్ హాస్పిటల్ లోనే ఉన్నాడు.
స్పెషల్ డాక్టర్ల పర్యవేక్షణలో శ్రీతేజ్ చికిత్స తీసుకుంటున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అల్లు అర్జున్(Allu Arjun), అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాస్(Bunny Vas) ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండగా, ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని అల్లు అర్జున్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాస్ శ్రీతేజ్‌ను చూడ్డానికి హాస్పిటల్ కు వెళ్లారు.
శ్రీతేజ్ హెల్త్ కండిషన్ గురించి బన్నీ వాస్ వైద్యులను అడిగి తెలుసుకుని, అవసరమైతే శ్రీతేజ్‌ను ఇంకా మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లాలని బన్నీ వాస్ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఈ దుర్ఘటన కారణంగా పుష్ప2 సినిమా గ్రాండ్ సక్సెస్ అయినా బన్నీ ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడనే విషయం అందరికీ తెలిసిందే.













