శ్రీను వైట్లకు ఇదే ఆఖరి ప్రయత్నం!
ఎక్కడైనా సక్సెస్ ఉంటేనే విలువ. ఇండస్ట్రీలో వారికి అయితే ఈ మాట ఇంకా బాగా సూటవుతోంది. ఇక్కడ సక్సెస్ వుంటేనే అన్నీ. ఒక్కసారి దానికి దూరమయ్యారా అంతే సంగతులు. అప్పటి వరకు చుట్టూ ఉన్నవారు కనుమరుగైపోతారు. డేట్స్ ఇచ్చే హీరోలు కూడా తప్పించుకుని తిరుగుతారు. ప్రస్తుతం ఈ సిట్యుయేషన్సే ఫేస్ చేస్తున్నాడు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల.
గత కొంతకాలంగా భారీ ఫ్లాపులతో సతమతమవుతూ తన ఫామ్‌ని కోల్పోయిన శ్రీను వైట్లతో పని చేయడానికి ఏ హీరో కూడా ఆసక్తి చూపడం లేదు. స్టార్ హీరోలు తనకు ముఖం చాటేస్తుండటంతో టైర్ల హీరోల చుట్టూ ప్రదక్షిణలు చేసి, చివరకు గోపీచంద్‌ను ఒప్పించినట్లు తెలుస్తోంది.
శ్రీను వైట్ల చెప్పిన పాయింట్ గోపీచంద్‌కు నచ్చడంతో వెంటనే కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మ్యాచో స్టార్. రీసెంట్గా పక్కా కమర్షియల్‌తో పరాజయం పాలైన గోపీచంద్, త్వరలోనే శ్రీను వైట్లతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమానే శ్రీను వైట్లకు ఆఖరి ప్రయత్నం అని, ఇది పోతే ఇక డైరెక్టర్‌గా శ్రీను వైట్ల కెరీర్ ముగిసినట్లే అని కామెంట్లు వినిపిస్తున్నాయి.













